మిరాయ్, కొరియన్ కనకరాజు సినిమాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రితికా నాయక్.. త్వరలో ‘పవర్ పేట’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు. మంగళవారం రితికా నాయక్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియో గ్లింప్స్‌తో ఆమె క్యారెక్టర్‌ను రివీల్ చేశారు.
ఇందులో ఆమె పాత్రను ‘పడమటవీధి జానకి’గా పరిచయం చేశారు. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన ఆమె.. పాతకాలపు ఇంట్లో ఊయల బల్లపై ఊగుతూ ఆకట్టుకుంటుంది. క్రీమ్ కలర్ హాఫ్ శారీలో ఉన్న తన లుక్ ఆకట్టుకుంది. ఆ తర్వాతి సీన్స్‌లో గ్లామరస్ లుక్‌లోనూ ఇంప్రెస్ చేసింది. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ వీడియో గ్లింప్స్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చింది. మొత్తానికి గత చిత్రాలతో పోల్చితే ఇందులో రితికా కొత్తగా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది.
ఇప్పటికే సేనాపతి రవిగా సందీప్ కిషన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్.. ఇప్పుడు హీరోయిన్ లుక్‌ను కూడా రివీల్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిందని, ఇంటెన్స్ క్యారెక్టర్లు, డ్రామాతో కూడిన పవర్‌ఫుల్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని మేకర్స్ తెలియజేశారు.
