రైల్వేలో స్టేషన్ మాస్టర్ పోస్టులు.. డిగ్రీ అభ్యర్థులకు భలే ఛాన్స్!

రైల్వేలో స్టేషన్ మాస్టర్ పోస్టులు.. డిగ్రీ అభ్యర్థులకు భలే ఛాన్స్!

రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డులు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్టేషన్ మాస్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 1215 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభం కాగా నవంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు పేరు: స్టేషన్ మాస్టర్. 

మొత్తం ఖాళీలు: 1215.

దక్షిణమధ్య రైల్వే (సికింద్రాబాద్) పరిధిలో 5 (అన్ రిజర్వ్డ్ 3, ఎస్సీ 1, ఎస్టీ 1, ఎక్స్ సర్వీస్​మెన్ 1 ), దక్షిణతీర రైల్వే (సికింద్రాబాద్) పరిధిలో 65 (అన్ రిజర్వ్డ్ 32, ఎస్సీ 6, ఎస్టీ 3, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ 12, ఎక్స్ సర్వీస్​మెన్ 1) ఖాళీలు ఉన్నాయి. 

విద్యార్హతలు: 

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2026, నవంబర్ 25 నాటికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
వయసు: 2027, జనవరి 1 నాటికి 20 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. 1994, జనవరి 2 కంటే ముందు 2007, జనవరి 1 తర్వాత జన్మించి 
ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, రైల్వే గ్రూప్–సి, గ్రూప్–డి ఉద్యోగులకు ఏడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 27.
అప్లికేషన్ ఫీజు: మహిళలు, ఎక్స్ – సర్వీస్​మెన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 
రూ. 250, ఇతరులు రూ. 500 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: నవంబర్ 25.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ),
 కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ), 
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సీబీటీ 70 శాతం, సీబీఏటీ 30 శాతం వెయిటేజీ ఉంటుంది. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్     rrbapply.gov.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్ 

కంప్యూటర్​ బేస్డ్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్​లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి. తప్పుడు సమాధానానికి 1/3వ వంతు లేదా 33.33 శాతం మార్కులు కోత విధిస్తారు. బేసిక్ సైన్స్, మ్యాథమెటికల్ అండ్ అనలైటికల్ కెపబిలిటీ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులకు, లాజికల్ కెపబిలిటీ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు ఇస్తారు. 
కనీస అర్హత మార్కులు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఓబీసీ, ఎస్సీ 30 శాతం, ఎస్టీ 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

సిలబస్ 


బేసిక్ సైన్స్, మ్యాథమెటికల్ అండ్ అనలిటికల్ కెపబిలిటీ (60 మార్కులు): ఈ విభాగం నుంచి అత్యధికంగా 60 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.  
గణితం: సంఖ్య వ్యవస్థ , నిష్పత్తి- అనుపాతం, సగటులు, శాతాలు, లాభ-నష్టాలు, డిస్కౌంట్లు, కాలం- పని, కాలం- వేగం- దూరం, బీజగణితం, రేఖాగణితం, త్రికోణమితి, ప్రొబబిలిటీ, స్టాటిస్టిక్స్.
సైన్స్ & ఇంజినీరింగ్ బేసిక్స్: యూనిట్లు, కొలతలు, ద్రవ్యరాశి, బరువు, సాంద్రత, శక్తి, ఘర్షణ, ఉష్ణోగ్రత, ప్రాథమిక విద్యుత్, లీవర్లు, సాధారణ యంత్రాలు.
డేటా అనాలిసిస్: టేబుల్స్, చార్ట్స్, గ్రాఫ్స్, పై చార్ట్స్, వెన్ డయాగ్రామ్స్, డేటా సఫిషియెన్సీ.
లాజికల్ కెపబిలిటీ (20 మార్కులు)
బైనరీ లాజిక్, సిలాజిజమ్ : గడియారాలు, క్యాలెండర్లు, స్టేట్‌‌మెంట్ అండ్ అజంప్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీస్, లాజిక్ ఆధారిత పజిల్స్​తోపాటు ఇంగ్లిష్ రీడింగ్ కాంప్రహెన్షన్ అంశాల నుంచి 20 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
మెంటల్ ఎబిలిటీ (20 మార్కులు): 
అనాలజీ, సిరీస్ కంప్లీషన్, కోడింగ్- డీకోడింగ్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్​మెంట్ నుంచి 20 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.