ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభం కాగా, నవంబర్ 13 వరకు అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 61.
విభాగాల వారీగా ఖాళీలు
టెక్నీషియన్ – బి (46): ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ సంబంధిత ఎలక్ట్రానిక్ ట్రేడ్స్ 24, ఫిట్టర్ 8, ఎలక్ట్రీషియన్ 4, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనింగ్ 5, టర్నర్ 1, మెషినిస్ట్ 2, మోటార్ వెహికల్ మెకానిక్ 1, ఎలక్ట్రోప్లాటర్ 1.
లైట్ వెహికల్ డ్రైవర్ – ఏ 3.
స్టాఫ్ కార్ డ్రైవర్–ఏ 2.
హెవీ వెహికల్ డ్రైవర్ –ఏ 10.
విద్యార్హతలు
టెక్నీషియన్ – బి పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ ఎన్‌టీసీ లేదా ఎన్‌ఏసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
డ్రైవర్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్ గా మూడేళ్లు/ హెవీ వెహికల్ డ్రైవర్గా ఐదేళ్లు అనుభవం ఉండాలి. అలాగే, ఎల్ఎంవీ/ హెచ్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు: 2026, నవంబర్ 13 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 24.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ. 500 చెల్లించాలి. రాత పరీక్ష తర్వాత మహిళలు, ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ. 500, ఇతరులకు రూ. 400 రీఫండ్ చేస్తారు.
లాస్ట్ డేట్: నవంబర్ 13.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.isro.gov.inను సందర్శించండి.
టెక్నీషియన్–బి ఎగ్జామ్ ప్యాటర్న్
రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 80 ప్రశ్నలు 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 90
నిమిషాల్లో పూర్తి చేయాలి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.33 మార్కులు కోత విధిస్తారు. ఇందులో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 32, రిజర్వ్డ్ అభ్యర్థులు 24 మార్కులు సాధించాల్సి ఉంటుంది. స్కిల్ టెస్టు 100 మార్కులకు ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 50, రిజర్వ్డ్ అభ్యర్థులు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
డ్రైవర్ ఎగ్జామ్ ప్యాటర్న్
హెవీ వెహికల్ డ్రైవర్–ఏ, లైట్ వెహికల్ డ్రైవర్–ఏ, స్టాఫ్ కార్ డ్రైవర్–ఏ పోస్టుల రాత పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షను120 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988 నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు, ఎలిమెంటరీ ఇంగ్లిష్ (8వ తరగతి స్థాయి) నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, ఎలిమెంటరీ అరిథమెటిక్ / గణితం (10వ తరగతి స్థాయి) నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. అభ్యర్థులు పార్ట్–ఏలో కనీసం 50 శాతం మార్కులు, పార్ట్-–బీ, సీ, డీల్లో కలిపి మొత్తం మీద కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని తదుపరి దశ అయిన డ్రైవింగ్ స్కిల్ టెస్టుకు ఎంపిక చేస్తారు.
