ప్రముఖ నవరత్న పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ అయిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐటీఐ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు:1067.
విభాగాల వారీగా ఖాళీలు: ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ 700, గ్రాడ్యుయేట్ (నాన్ – ఇంజినీరింగ్) అప్రెంటిస్ 367.
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: ఫిట్టర్ 125, టర్నర్ 45, మెకానిక్ (మెటార్ వెహికల్) 110, ఎలక్ట్రీషియన్ 125, వైర్‌మెన్ 110, మెకానిక్ (డీజిల్) 5, స్టెనోగ్రాఫర్ 20, వెల్డర్ 120, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 30, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్ 10.
విద్యార్హతలు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రిషియన్, వైర్‌మెన్, వెల్డర్, సీఓపీఏ తదితర ట్రేడ్‌ల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రాడ్యుయేట్ (నాన్– ఇంజినీరింగ్) అప్రెంటిస్: కామర్స్ 70, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ 72, కంప్యూటర్ సైన్స్ 93, కంప్యూటర్ అప్లికేషన్ 45, జియాలజీ 14, మైక్రో బయాలజీ 5, కెమిస్ట్రీ 26, ఫార్మాసిస్ట్ (అలోపతి) 3, ఫార్మాసిస్ట్ (ఆయుర్వేద్) 3, నర్సింగ్ 36.
విద్యార్హతలు: బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
వయసు: 2026, అక్టోబర్ 31 నాటికి 18 ఏళ్లుఉండాలి. 2008, అక్టోబర్ 31 కంటే ముందు జన్మించిన వారై ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 21.
లాస్ట్ డేట్: నవంబర్ 9.
సెలెక్షన్ ప్రాసెస్: ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nlcindia.inను సందర్శించండి.
