Actor Ali Emotional: ఆపరేషన్ థియేటర్‌లో అలీ భార్య.. కంటతడి పెట్టిన కమెడియన్!

Actor Ali Emotional: ఆపరేషన్ థియేటర్‌లో అలీ భార్య.. కంటతడి పెట్టిన కమెడియన్!

వెండితెరపై తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించే పంచే నటుడు అలీ.. అయితే తన భార్య జుబేదా ఆరోగ్యం విషయంలో ఆయన తీవ్ర ఆందోళన గురైయ్యారు. గుండె సంబంధిత సమస్యతో ఉన్న ఆమెను శస్త్రచికిత్సకు ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్తున్న సమయంలో అలీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కంటతడి పెట్టిన అలీ..

తొలుత జుబేదా ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆపరేషన్ థియేటర్‌లోకి జుబేదాను తీసుకెళ్తున్న సమయంలో అలీ తన భావోద్వేగాలను అదుపు చేసుకునేందుకు ప్రయత్నించిన దృశ్యాలు నెటిజన్లను కదిలిస్తున్నాయి. సాధారణంగా తెరపై నవ్వులు పూయించే అలీ.. జీవిత భాగస్వామి విషయంలో ఎంత సున్నితంగా స్పందించారో ఈ వీడియో చూపిస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

వైద్యుల పర్యవేక్షణలో జుబేదా అలీ శస్త్రచికిత్స విజయవంతమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. అయితే ఆమెకు ఎదురైన గుండె సమస్య ఏమిటి? ఎలాంటి శస్త్రచికిత్స చేశారు? అనే వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.

►ALSO READ | RashmikaVijay: "నా ప్రేమ నా ఇష్టం!".. ట్రోలర్స్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్!

భార్యకు అండగా..

జుబేదా కూడా సోషల్ మీడియాలో తన కష్టకాలంలో భర్త అందించిన మద్దతు గురించి భావోద్వేగంగా స్పందించించారు.. కష్ట సమయంలో ప్రేమించే వ్యక్తి తోడుగా ఉండటం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆమె చెప్పారు. ఇప్పుడు జుబేదా మాటలు దాంపత్య బంధంలోని అనుబంధాన్ని చాటుతున్నాయి. ప్రస్తుతం జువేదా త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

మూడు దశాబ్దాల అనుబంధం..

అలీ, జుబేదా 1994 జనవరి 23న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జువేరియా మీతీ, ఫాతిమా రమీజున్ అనే ఇద్దరు కుమార్తెలు, మహమ్మద్ అబ్దుల్ సుబ్హాన్ అనే కుమారుడు ఉన్నారు. నటుడిగా అలీ ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ, కుటుంబం విషయంలో ఆయనకున్న అనుబంధం ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చింది.