సినిమా లవర్స్‌కు ఈ వీకెండ్ ఫుల్ మీల్స్ రెడీ అవుతోంది. లవ్ స్టోరీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, గ్యాంగ్‌స్టర్ డ్రామా, హారర్ మిస్టరీ.. ఇలా డిఫరెంట్ జానర్లలో కొత్త కంటెంట్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 29, 30 తేదీల్లో పలు ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. మరి ఏ సినిమా ఎక్కడ విడుదలవుతోంది? వాటి స్టోరీ బ్యాక్ డ్రాప్స్ ఏంటి? అనేది ఓ లుక్కేద్దాం..
అక్క – నెట్‌ఫ్లిక్స్
1980ల నాటి నేపథ్యం.. మహిళల ఆధిపత్యంలో నడిచే ఓ ప్రాంతం.. అధికారం కోసం జరిగే పోరాటాలు.. వీటి మధ్య సాగే ఉత్కంఠభరితమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘అక్క’. కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌పై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానున్న ఈ సిరీస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.
తెల్ల కాగితం – ఈటీవీ విన్
టీనేజ్ లవ్, మనసులో మెదిలే భావాలు, యువత జీవితంలో ఎదురయ్యే అనుభవాలు.. ఇలా రొమాంటిక్ ఎమోషన్స్‌తో సాగే కథ ‘తెల్ల కాగితం’. యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 29 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి ఇది వీకెండ్ కి మంచి ఆప్షన్ కానుంది.
బత్తా (Baththa) – నెట్‌ఫ్లిక్స్
విజయ్ సేతుపతి నటించిన తమిళ కామెడీ డ్రామా ‘బత్తా’ అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 1980ల మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ చిన్న బాలుడు పొరపాటున ఓ భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ను స్కూల్ బాత్రూమ్లో బంధిస్తాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడే అనుబంధం, గ్యాంగ్‌స్టర్ జీవితంలో వచ్చే మార్పులు నవ్వులు పంచుతూనే భావోద్వేగాలకు గురిచేస్తాయి. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ALSO READ : "నా ప్రేమ నా ఇష్టం!".. ట్రోలర్స్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్!
సిగ్మా (Sigma) – నెట్‌ఫ్లిక్స్
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘సిగ్మా’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అప్పులు, క్రైమ్ నెట్వర్క్, భారీ దోపిడీ చుట్టూ సాగే ఈ సినిమా అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఓటీటీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రుద్రవనం పీఎస్ – జీ5
ఓ మిస్టరీ హత్య.. అనుమానాస్పద పరిస్థితులు.. ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ మరింత క్లిష్టంగా మారే కేసు! పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్రవనం పీఎస్’. నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్కు రానుంది. సస్పెన్స్, ట్విస్టులతో కూడిన క్రైమ్ కథలను ఇష్టపడేవారికి ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉండనుంది.
ఇమ్మోర్టల్ – సోనీ లివ్
ప్రేమలో మొదలయ్యే ప్రయాణం.. ఆ తర్వాత వెంటాడే వింత సంఘటనలు.. వాటి వెనుక దాగి ఉన్న భయంకరమైన రహస్యాలు! జీవీ ప్రకాష్ కుమార్ నటించిన రొమాంటిక్ హారర్ మిస్టరీ ‘ఇమ్మోర్టల్’ అక్టోబర్ 30 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. తెలుగు డబ్బింగ్‌తో సహా పలు భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ చిత్రం హారర్, మిస్టరీ అభిమానులను అలరించనుంది. మొత్తానికి.. ఈ వీకెండ్ ఓటీటీలో ప్రేమ, భయం, ఉత్కంఠ, యాక్షన్.. అన్నీ కలగలిసిన ఎంటర్టైన్మెంట్ సిద్ధమవుతోంది. మరి ఈ వీకెండ్ ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ!
