రెండో వండేలో జింబాబ్వే చిత్తు.. హర్మన్, దీప్తి సెంచరీల మోత.. మలుపు తిప్పిన వైష్ణవి !

రెండో వండేలో జింబాబ్వే చిత్తు.. హర్మన్, దీప్తి సెంచరీల మోత..  మలుపు తిప్పిన వైష్ణవి  !

హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ సెంచరీల మోతతో భారీ స్కోర్ చేసిని ఇండియా విమెన్ టీమ్.. వైష్ణవి శర్మ బాల్ తో చేసిన మాయాజాలంతో 121 రన్స్ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. 2026 అక్టోబర్ 25న వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గెలుపుతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో 2- 0తో సిరీస్ కైవసం చేసుకుంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 రన్స్ భారీ స్కోర్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 121 బంతులలో 15 ఫోర్లతో 126 రన్స్ చేయగా.. దీప్తి శర్మ 86 బంతులలో 15 ఫోర్లతో 106 రన్స్ చేసి భారీ స్కోర్ అందించారు. అంతకు ముందు ఓపెనర్ ప్రతీక రావల్ 67 బంతులలో 2 సిక్సులు, 4 ఫోర్లతో మంచి ఆరంభాన్ని ఇచ్చింది. కెప్టెన్ స్మృతి మంధాన్న డకౌట్ అయినప్పటికీ ఇద్దరి సెంచరీలతో ఇండియా బిగ్ టార్గెట్ ఉంచగలిగింది. 

ఛేజింగ్ లో జింబాబ్వే విలవిల:

ఛేజింగ్ లో జింబాబ్వే బ్యాటర్లు తేలిపోయారు. తొలుత ఓపెనర్ ముపాచిక్వ 70 బంతులలో 49 రన్స్ తో శుభారంభం ఇచ్వగా ఆమెకు తోడు చిపో ముగేరి 57 బంతులలో 46 రన్స్ చేసి స్కోర్ కార్డును పెంచారు. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు అంతగా ఆడకపోవడంతో జింబాబ్వే 48.5 ఓవర్ల దగ్గర 207 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 

ఇక ఇండియా బౌలర్లలో వైష్ణవి శర్మ మ్యాచ్ జింబాబ్వే చేతికి పోకుండా నాలుగు వికెట్లు తీసి టర్న్ చేసింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా.. సయాలి సత్గారే, శ్రీచరణి, కలిత తలా ఒక వికెట్ తీశారు.