డ్రైవర్ కు మూర్ఛరావడంతో.. సంతలోకి దూసుకెళ్లిన హార్వెస్టర్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

డ్రైవర్ కు మూర్ఛరావడంతో.. సంతలోకి దూసుకెళ్లిన హార్వెస్టర్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

నిర్మల్ జిల్లా కుంటాలలో హార్వెస్టర్ బీభత్సం సృష్టించింది. రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు మూర్ఛ రావడంతో వాహనాలు, జనంపైకి దూసుకెళ్లింది. పెద్ద వాహనం కావడంతో పలు బైకులు హార్వెస్టర్ చక్రాల కింద నలిగిపోయాయి. ఈ ప్రమాదంలో  ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.  ఆదివారం(అక్టోబర్25) సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం కుంటాలలో ఓ వారాంతంలో నిర్వహించే సంతలో జరిగింది. 

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కుంటాలం మండలంలోని అంబకంటి నుంచి హార్వెస్టర్క మండల కేంద్రానికి వస్తోంది. కుంటాల సంత దగ్గరకు రాగానే డ్రైవర్ కు ఒక్కసారిగా మూర్ఛ రావడంతో హార్వెస్టర్ అదుపు తప్పి అక్కడే జనంపైకి దూసుకెళ్లింది. దీంతో  భయంతో ప్రజలు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో పలు బైకులు ధ్వంసమయ్యాయి. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చికేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.