మంచిర్యాల జిల్లాలో విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు మృతి

మంచిర్యాల జిల్లాలో విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు మృతి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీటి కుంటలో దిగి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


వివరాల్లోకి వెళ్తే.. వలస వ్యాపారులు ఇందారం గ్రామానికి వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని నీటి కుంటలోకి దిగిన వారు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఒకేసారి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.