- నవంబర్ 17 నాటికి సిలబస్ పూర్తి చేయాలంటూ నిర్ణయం
నిర్మల్, వెలుగు : ఎల్ నినో కారణంగా తాగునీటి ఎద్దడి ఏర్పడడంతో దసరా సెలవులను పొడిగించిన బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం నవంబర్ 17 నాటికి ఆన్లైన్ లోనే సిలబస్ ను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ట్రిపుల్ఐటీ యాజమాన్యం శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. పీయూసీ1, పీయూసీ2 విద్యార్థులు నవంబర్ 10 లోగా క్యాంపస్ లో రిపో ర్ట్ చేయాలని, వీరికి ఇదే నెల 18 వరకు తరగతులు కూడా నిర్వహించినట్లు తెలిపింది.
ఇంజినీరింగ్ ఈ1 నుంచి ఈ 4 విద్యార్థులందరూ నవంబర్ 18 న క్యాంపస్ లో రిపోర్ట్ చేయాలని పేర్కొంది. విద్యార్థులు మిడ్ టర్మ్, సెమిస్టర్ థియరీ ప్రాక్టికల్ పరీక్షలన్నీ ఆఫ్ లైన్ ఫిజికల్ మోడ్ లోనే నిర్వహిస్తారని తెలిపింది. పీయూసీ నుంచి ఇంజినీరింగ్ అన్ని బ్యాచుల విద్యార్థులకు మిడ్ టర్మ్ ఆబ్జెక్టివ్ పరీక్షలు నవంబర్ 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
