‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ పేరుతో యాంకర్ సుమ కనకాల సోషల్ సర్వీస్

‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ పేరుతో యాంకర్ సుమ కనకాల సోషల్ సర్వీస్

ప్రముఖ యాంకర్ సుమ కనకాల ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ పేరుతో గత ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఈ సంస్థ ఐదో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేని కొణిదెల, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై సుమ కనకాల చేస్తున్న సేవలను అభినందించారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని సమాజానికి ఉపయోగపడేలా మార్చాలనే ఆలోచన నుంచే  ఈ సంస్థ పుట్టిందని,  ఈ ఐదేళ్ల ప్రయాణంలో తమను నమ్మి అండగా నిలిచిన దాతలకు సుమ కనకాల ధన్యవాదాలు తెలియజేశారు.  నటుడు రాజీవ్ కనకాల సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.