తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా రూపొందుతున్న చిత్రం ‘శనార్తి’. ఎ టేల్ ఆఫ్ కల్చర్ అనేది ట్యాగ్‌లైన్. సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంపత్ నంది శిష్యుడు రాజ్ గణేష్ ఉప్పునూతి దర్శకుడు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను కరీంనగర్ జిల్లా వెలిచాలలో పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. వెలిచాల, గట్టు భూత్కూర్ ప్రాంతాల్లో నెల రోజుల పాటు షూటింగ్ జరగనుందని మేకర్స్ తెలియజేశారు.
మురళీధర్ గౌడ్, సునందిని, సుంకర లక్ష్మి, రమేష్ నకిరికంటి, వైవా రెడ్డి, మై విలేజ్ షో రాజు, అంజి బాబు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, బేబీ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
