‘అక్క’ భవానీగా కీర్తి సురేష్.. అక్టోబర్ 30 నుంచి ‘అక్క’ వెబ్ సిరీస్ నుంచి నెట్‌‌‌‌ ఫ్లిక్స్‌‌‌‌లో స్ట్రీమింగ్

‘అక్క’ భవానీగా కీర్తి సురేష్.. అక్టోబర్ 30 నుంచి ‘అక్క’ వెబ్ సిరీస్ నుంచి నెట్‌‌‌‌ ఫ్లిక్స్‌‌‌‌లో స్ట్రీమింగ్

రీసెంట్‌‌‌‌గా ‘డోరతి’ చిత్రంతో పాటు ‘ది ప్యారడైజ్‌‌‌‌’లోని స్పెషల్‌‌‌‌ సాంగ్‌‌‌‌తో ప్రేక్షకులను పలకరించిన కీర్తి సురేష్.. ‘అక్క’ అనే క్రైమ్ డ్రామా వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎయిటీస్‌‌‌‌ పీరియాడికల్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో వస్తున్న ఈ సిరీస్‌‌‌‌కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించగా యశ్ రాజ్ ఫిల్మ్స్‌‌‌‌ నిర్మించింది.

ఈ నెల 30  నుంచి నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది.  తాజాగా తెలుగు వెర్షన్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. లేడీ గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌గా కీర్తి సురేష్‌‌‌‌ నటన, తన లుక్‌‌‌‌, డైలాగ్ డెలివరీ హైలైట్‌‌‌‌గా నిలిచాయి. ఈ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ కోసం మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌, గన్‌‌‌‌ షూటింగ్‌‌‌‌లోనూ ట్రైనింగ్‌‌‌‌ తీసుకున్నట్టు ప్రమోషన్స్‌‌‌‌లో చెప్పింది కీర్తి సురేష్.

ముఖ్యంగా హిందీ  డైలాగ్‌‌‌‌ డెలివరీ విషయంలో విమర్శలు రాకుండా కేర్ తీసుకుందట. తాను సౌత్ ఇండియన్ కావడంతో హిందీ యాసను పర్ఫెక్ట్‌‌‌‌గా పలకడం కోసం శిక్షణ తీసుకుని డబ్బింగ్ చెప్పినట్టు ఆమె తెలియజేసింది. రాధికా ఆప్టే విలన్‌‌‌‌గా నటించగా తన్వీ ఆజ్మీ, మహేష్ మంజ్రేకర్, అన్షుమన్ పుష్కర్, మోనికా పన్వార్ ఇతర పాత్రలు పోషించారు.  ప్రస్తుతం తెలుగులో ఆమె జనవరి 12 విడుదల, రౌడీ జనార్ధన్ చిత్రాల్లో నటిస్తోంది.