మా వేతనం రూ.35 వేలకు పెంచండి..ప్రభుత్వానికి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటీ యూనియన్ విజ్ఞప్తి

మా వేతనం రూ.35 వేలకు పెంచండి..ప్రభుత్వానికి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటీ యూనియన్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న హవర్లీ బేస్డ్ టీచర్ల వేతనాన్ని నెలకు రూ.35 వేలకు పెంచాలని హవర్లీ బేస్డ్ టీచర్స్ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటీ) యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారిని కలిసి వినతిపత్రం అందించారు.

గంటల ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే గౌరవప్రదమైన వేతనం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఏడీ సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీనిచ్చారు.