ఆదిలాబాద్‌‌‌‌ గిరిజనులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌‌‌‌

ఆదిలాబాద్‌‌‌‌ గిరిజనులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో గిరిజనులకు క్యాస్ట్​ సర్టిఫికెట్ల జారీలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ​అధికారులను ఆదేశించారు. శనివారం సెక్రటేరియెట్‌‌‌‌లో  అధికారులతో సమావేశమయ్యారు. ఇది అత్యంత సున్నితమైన అంశమని, అర్హులైన గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర చట్టాలకు అనుగుణంగానే  నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. ముఖ్యంగా 1950కి ముందు  పాత రికార్డులు, ఓటరు జాబితాలు,  పరిశీలించి అర్హులకే సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. మహారాష్ట్ర నుంచి  వచ్చిన వ్యక్తులు స్థానిక గిరిజనులుగా సర్టిఫికెట్ల కోసం చేసే క్లెయిమ్‌‌‌‌లపై   అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఎల్‌‌‌‌నినోను కాంగ్రెస్ సృష్టించిందా?: హరీశ్ పై మంత్రి ఫైర్
కాంగ్రెస్​ వల్లే కరువు వచ్చిందంటూ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు చేస్తున్న విమర్శలకు మంత్రి అడ్లూరి  కౌంటర్​ ఇచ్చారు. ఎల్‌‌‌‌నినోను కాంగ్రెస్ సృష్టించిందా.. వాతావరణాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చగలరా..? అని నిలదీశారు. శనివారం సీఎల్పీలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ముందస్తు చర్యలు చేపడితే దాన్ని భయపెట్టడం అని ఎలా చెప్తారని హరీశ్​ను నిలదీశారు.