రైజింగ్ ఏషియా కప్ షెడ్యూల్ విడుదల.. మళ్లీ భారత్ vs పాక్ పోరు!

రైజింగ్ ఏషియా కప్ షెడ్యూల్ విడుదల.. మళ్లీ భారత్ vs పాక్ పోరు!

ACC Men's Asia Cup Rising Stars 2026: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అభిమానులకు అదిరిపోయే వార్త అందించింది. ACC మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ అధికారికంగా విడుదలవుతోంది. ఖతార్ రాజధాని దోహా వేదికగా నవంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గ్రూప్-బిలో భారత్ 'ఎ' (India 'A'), చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ 'ఎ' (Pakistan 'A') జట్లు ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకుంది. దీంతో మరోసారి భారత్-పాక్ మధ్య బిగ్ పోరు ఫిక్స్ అయింది. 

టోర్నీ ఫార్మాట్ ఇదే:

* ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా, వాటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. సింగిల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచే జట్లు నవంబర్ 26, 27 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్రతిష్టాత్మక ఫైనల్ పోరు నవంబర్ 29వ తేదీన జరగనుంది.

* గ్రూప్-బి: భారత్ 'ఎ', పాకిస్థాన్ 'ఎ', నేపాల్, యూఏఈ (UAE).

* గ్రూప్-ఎ: శ్రీలంక 'ఎ', బంగ్లాదేశ్ 'ఎ', అఫ్గానిస్థాన్ 'ఎ', హాంకాంగ్.

భారత్ vs పాక్ మ్యాచ్:

* దోహాలోని వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దోహా యూనివర్సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (UDST) మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

* నవంబర్ 20 (మధ్యాహ్నం 1:30 PM IST): ఇండియా 'ఎ' vs నేపాల్ (తొలి మ్యాచ్)

* నవంబర్ 22 (మధ్యాహ్నం 1:30 PM IST): ఇండియా 'ఎ' vs పాకిస్థాన్ 'ఎ' (హై-వోల్టేజ్ మార్క్యూ మ్యాచ్)

* నవంబర్ 24 (ఉదయం 11:30 AM IST): ఇండియా 'ఎ' vs యూఏఈ

లిస్ట్-ఎ హోదా గుర్తింపు:

* నేపాల్, యూఏఈ, హాంకాంగ్ జట్లు తమ సీనియర్ జట్లను బరిలోకి దింపుతుండగా.. భారతదేశపు టీమిండియా 'ఎ' జట్టుతో నేపాల్, యూఏఈ ఆడే మ్యాచ్‌లకు అధికారిక లిస్ట్-ఎ (List A) హోదా లభించనుంది. అలాగే నేపాల్ - యూఏఈ మధ్య జరిగే మ్యాచ్ అధికారిక వన్డే (ODI)గా పరిగణించబడుతుంది.

* గతేడాది దోహాలోనే జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో బంగ్లాదేశ్ 'ఎ' పై సూపర్ ఓవర్‌లో గెలిచి పాకిస్థాన్ 'ఎ' (పాకిస్థాన్ షాహీన్స్) టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్లకు భారత్ 'ఎ' గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.