సుచిత్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఫీల్ గుడ్’. అదితి త్రిపాఠి హీరోయిన్. దయానంద్ దర్శకుడు. శనివారం ఈ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. లవ్‌లోని సరదా, స్నేహం, ధైర్యం, ఉత్సాహాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఈ పాటను రూపొందించారు. శాండిల్య పీసపాటి అందించిన మ్యూజిక్, కడలి సత్యనారాయణ లిరిక్స్, తుషార నిలయ, శాండిల్య పీసపాటి పాడిన పాట యూత్‌ను ఆకట్టుకునేలా సాగింది.
రవూరి ప్రియాంక, లిఖిత్, రణధీర్ వాసుదేవ్, సైఫాని, దివ్య మోహన్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
