‘35 చిన్న కథ కాదు’ చిత్రంతో ఆకట్టుకున్న విశ్వదేవ్ హీరోగా మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యాడు. నర్సి రాజగిరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు. ‘ముఖచిత్రం’ దర్శకుడు గంగాధర్.. శ్రీ తులసి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. శనివారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఓ కొత్త తరహా కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండబోతోందని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
