- స్టైపెండ్, ట్రైనింగ్, ఎగ్జామ్స్ వివాదాలకు పరిష్కారం
హైదరాబాద్, వెలుగు: పీజీ, సూపర్ స్పెషాలిటీ మెడడికల్ స్టూడెంట్స్(ట్రైనీలు), ఇనిస్టిట్యూట్ల మధ్య వచ్చే సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఎన్బీఈఎంఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రైనింగ్, స్టైపెండ్, సెలవులు, థీసిస్, ఎగ్జామ్స్ వివాదాల కోసం గ్రీవెన్స్ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది.
ట్రైనీలకు ఇన్స్టిట్యూట్లలో న్యాయమైన, అనుకూల వాతావరణం కల్పించాలని ఆదేశించింది. సమస్యలు ఎదురైతే విద్యార్థులు ముందుగా తమ కాలేజీలోని లెవల్–1 గ్రీవెన్స్ కమిటీని సంప్రదించాలి. ఆ కమిటీ ఆధారాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించాలి. అక్కడి నిర్ణయంపై అసంతృప్తి ఉంటే, బోర్డు ఆధ్వర్యంలోని లెవల్–2 ఎన్బీఈఎంఎస్ గ్రీవెన్స్ కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. లెవల్–2 కమిటీ ఇచ్చే నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది.
