నవంబర్  4న సదర్ సమ్మేళనం..ఎన్టీఆర్ స్టేడియంలో గోమాత, శ్రీకృష్ణ పూజలు

నవంబర్  4న సదర్ సమ్మేళనం..ఎన్టీఆర్ స్టేడియంలో గోమాత, శ్రీకృష్ణ పూజలు
  • ప్రత్యేక ఆకర్షణగా దేశీ దున్నరాజుల ప్రదర్శన
  • అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి: మాజీ ఎంపీ అంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ యాదవ్

సైఫాబాద్, వెలుగు: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 4న శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ అంజన్‌‌‌‌‌‌‌‌కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం ఆదర్శ్‌‌‌‌‌‌‌‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి కార్యక్రమ వివరాలు వెల్లడించారు.  సదర్ ఉత్సవాలకు  రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించడం యాదవ సమాజానికి గర్వకారణమని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు.

వచ్చే నెల 4న బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో  గోమాత, శ్రీకృష్ణ పూజలతో పాటు ప్రత్యేక జాతుల దున్నరాజుల ప్రదర్శన, డప్పు, డోలు, సంప్రదాయ వాద్యబృందాల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకులు హాజరవుతారని చెప్పారు.

అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, యాదగిరిగుట్ట ఆలయ పాలకమండలి సభ్యురాలు ఈశ్వరమ్మ, శంకర్ యాదవ్, పాండు యాదవ్, రమేష్ యాదవ్, లడ్డు యాదవ్ తదితరులు పాల్గొన్నారు