Team India: న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ భారత మెన్స్ క్రికెట్ చరిత్రలోనే ప్రతిష్టాత్మకమైనదిగా నిలిచింది. ఈ మ్యాచ్ రూపంలో టీమిండియా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో తన 300వ టీ20 మ్యాచ్ (300th T20I) ఆడి అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు 300+ కంటే ఎక్కువ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఏకైక జట్టుగా పాకిస్థాన్ (304 మ్యాచ్‌లు) ఉండగా, ఇప్పుడు ఆ టీమ్ సరసన భారత్ (300 మ్యాచ్‌లు) నిలిచింది.
అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన జట్లు:
* పాకిస్థాన్: 304 మ్యాచ్‌లు
* భారత్: 300 మ్యాచ్‌లు
* న్యూజిలాండ్: 269 మ్యాచ్‌లు
* వెస్టిండీస్: 260 మ్యాచ్‌లు
* శ్రీలంక: 243 మ్యాచ్‌లు
200 విజయాల మైలురాయిపై కన్ను:
అంతర్జాతీయ టీ20ల్లో భారత జట్టు సాధించిన జయభేరి రికార్డు అత్యంత విశేషమైనది. ఇప్పటి వరకు ఆడిన 299 మ్యాచ్‌లలో టీమిండియా 199 నేరుగా (Outright) విజయాలు నమోదు చేసింది. ఈ మైలురాయితో పొట్టి ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
2026లో టీమిండియా ఊచకోత:
* 37వ మ్యాచ్: 2026 క్యాలెండర్ ఇయర్ లో భారత్‌కు ఇది 37వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం.
* 24 విజయాలు: ఈ ఏడాది ఆడిన 36 మ్యాచుల్లో టీమిండియా ఏకంగా 24 విజయాలు సాధించి అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.
* కివీస్‌పై ఆధిపత్యం: 2026లో న్యూజిలాండ్‌తో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో భారత్ ఏకంగా 6 సార్లు గెలిచి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.
