Ishan Kishan: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ (Ishan Kishan) గాయం కారణంగా మూడో టీ20కి కూడా అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. కుడి తొడ కండరాల గాయం (Right Adductor Strain)తో రెండో టీ20కి దూరమైన ఇషాన్, ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు.. మూడో టీ20కి అతడు దూరం కావడం భారత బ్యాటింగ్ లైన్-అప్‌కు, ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్ పొజిషన్ కి పెద్ద మైనస్‌గా మారనుంది.
నంబర్- 3లో పవర్ మిస్సింగ్:
* ఇషాన్ కిషన్ జట్టుకు దూరమవ్వడం వల్ల భారత జట్టు మూడో స్థానంలో పవర్‌ఫుల్ హిట్టింగ్ చేసే బ్యాటర్ ని కోల్పోతోంది.
* తొలి టీ20లో: గాయం కారణంగా ఇషాన్ 5వ స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, నంబర్-3లో తిలక్ వర్మ (6 పరుగులు) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
* రెండో టీ20లో: 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని మూడో స్థానంలో బరిలోకి దించినప్పటికీ, అతనూ (4 పరుగులు) ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు.
* ఇషాన్ నంబర్-3 రికార్డ్: భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇషాన్ నంబర్-3లో అద్భుతమైన రికార్డు సాధించాడు. మొత్తం 35 టీ20ల్లో 171.44 స్ట్రైక్ రేట్‌తో 1,159 రన్స్ చేయగా.. ఒక్క నంబర్-3 లోనే 26 ఇన్నింగ్స్‌లలో 884 పరుగులు బాదేశాడు.
కుమార్ కుషాగ్రకి ఛాన్స్:
* ఇషాన్ కిషన్ కోలుకోవడానికి సమయం పడుతుండటంతో, అతని జార్ఖండ్ సహచర ఆటగాడు కుమార్ కుషాగ్ర (Kumar Kushagra) ని కవర్ ప్లేయర్‌గా భారత స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. బీసీసీఐ మెడికల్ టీమ్ ఇషాన్ రీ-హాబిటేషన్‌ను నిశితంగా పరిశీలిస్తోంది. అక్టోబర్ 30 (శుక్రవారం) ఆక్లాండ్ వేదికగా జరగనున్న నాలుగో టీ20 నాటికి ఇషాన్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
