India vs Pakistan: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లను కేవలం ఒక క్రీడాంశంగా కాకుండా, రెండు దేశాలు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్న యుద్ధంలా చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ రచయిత శశిథరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. క్రీడల్లో రాజకీయాలు విపరీతంగా పెరిగిపోయాయని, అందుకే రాజకీయ నాయకులు, పొలిటికల్ సంబంధాలు ఉన్న వ్యక్తులు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌ను ఏలుతున్నారని ఆయన విమర్శించారు. ముంబై లిట్‌ఫెస్ట్‌లో (Mumbai LitFest) పాల్గొన్న సందర్భంగా శశిథరూర్ క్రీడలు - రాజకీయాల అనుబంధంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
నో-హ్యాండ్‌షేక్ వివాదంపై అసంతృప్తి:
* ఇరు దేశాల మధ్య రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో.. మైదానంలో ఇండియన్ ఆటగాళ్లు పాకిస్థాన్ క్రికెటర్లతో చేతులు కలపకపోడాన్ని (No Handshake Policy) శశిథరూర్ మరోసారి తప్పుబట్టారు. మైదానంలో చేతులు కలపకూడదనే విధానం ఏమాత్రం అర్థరహితమైనది. ఈ విధానాన్ని విమర్శిస్తూ గతంలో నేను రాసినప్పుడు నన్ను తీవ్రంగా ట్రోల్ చేశారు. కానీ క్రీడా స్ఫూర్తిని రాజకీయాల నుంచి వేరుగా ఉంచాలన్నాడు.
* 1999 కార్గిల్ వార్ ఉదాహరణ: 1999లో సరిహద్దుల్లో కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయాన కూడా ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడి, క్రీడా స్ఫూర్తితో హ్యాండ్‌షేక్ చేసుకున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఆటలో రాజకీయం తీసుకురావడం సరికాదన్నాడు.
క్రీడల్లోకి రాజకీయం.. దౌత్య సంబంధాలు బ్రేక్:
* డిప్లొమసీగా క్రికెట్ విఫలం: ఒకప్పుడు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి క్రికెట్ డిప్లొమసీని నాయకులు ఉపయోగించేవారని, కానీ ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోవడంతో ఆ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
* ప్రభుత్వాల ఆధిపత్యం: క్రికెట్‌ను రాజకీయాల నుంచి, రాజకీయాలను క్రికెట్ నుంచి వేరు చేయడం సాధ్యపడటం లేదని, ప్రతీ మ్యాచ్‌ను దేశాల నడుమ జరిగే పోరాటంగా చిత్రీకరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
పహల్గామ్ దాడితో అసలు రచ్చ:
* ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, దాని తర్వాత భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' చర్యల అనంతరం భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత క్షీణించాయి.
* మైదానంలో టీమిండియా ప్లేయర్స్ సైన్యానికి మద్దతుగా పాక్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం, ట్రోఫీ ప్రెజెంటేషన్ సమయాల్లో ప్రతిష్టంభన ఏర్పడడంపై బీజేపీ (BJP) మద్దతు తెలపగా, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
