హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా భార్గవ్ మాచర్ల రూపొందిస్తున్న చిత్రం ‘రోమియో జూలియట్’. ఈటీవీ విన్ సమర్పణలో సుందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు. నవంబర్ 13న సినిమా విడుదల కానుంది. శనివారం ఈ చిత్రం నుంచి ‘సారీ బేబీ’ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో హర్షిత్ మాట్లాడుతూ ‘ప్రభాస్ గారు మా మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇదొక క్రేజీ కాన్సెప్ట్. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే ఆడియన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని చెప్పాడు.
ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని, ప్రస్తుత జనరేషన్‌లోని రిలేషన్‌షిప్స్‌పై రాబోతోందని హీరోయిన్ విశాఖ ధిమాన్ చెప్పింది. డైరెక్టర్ భార్గవ్ మాచర్ల మాట్లాడుతూ ‘ఇది అందరి బయోపిక్. మనందరి జీవితంలో ఎక్కడో ఒకచోట కనెక్ట్ అయ్యే ఎమోషన్‌తో సినిమా తీశా. హిలేరియస్ ఫన్ రైడ్‌లా ఉంటుంది. రిలేషన్‌షిప్స్‌పై సోషల్ సెటైర్‌తో పాటు మంచి డ్రామా కూడా ఉంది’ అని చెప్పాడు. ఈటీవీ విన్ వైస్ ప్రెసిడెంట్ సాయికృష్ణ, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ భరణ్, వైవా హర్ష కార్యక్రమంలో పాల్గొని ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని అన్నారు.
