ఆదిలాబాద్ టౌన్: నకిలీ నంబర్ ప్లేట్ తో మక్కల లోడ్ మాయం..లారీ స్వాధీనం, ఇద్దరి అరెస్ట్

ఆదిలాబాద్ టౌన్: నకిలీ నంబర్ ప్లేట్ తో మక్కల లోడ్ మాయం..లారీ స్వాధీనం, ఇద్దరి అరెస్ట్
  • ఆదిలాబాద్​ జిల్లాలో ఘటన​

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: తప్పుడు నంబర్ ప్లేట్, నకిలీ లారీ పత్రాలతో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ యాప్ ద్వారా లారీ కిరాయికి అందుబాటులో ఉందని నమ్మించి, సరుకు రవాణా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి టూటౌన్ పీఎస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో వివరాలు వెల్లడించారు. హర్యానాకు చెందిన లారీ యజమాని రషీద్, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన డ్రైవర్ షౌకత్ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బక్ యాప్ ద్వారా లారీ కిరాయిలు పొందేవారు. 

డబ్బు సంపాదించాలని వ్యాపారులను మోసం చేయాలని పథకం వేశారు. ఈ నెల 7న యాప్ ద్వారా ఆదిలాబాద్ నుంచి కర్ణాటకకు మొక్కజొన్నలు రవాణా చేసేందుకు బుకింగ్ పొందారు. జైనథ్ గ్రామంలో 40,435 కిలోల మొక్కజొన్నలను లారీలో లోడ్ చేసుకుని, ఖర్చుల పేరుతో బాధితుడు రోహిత్ షిండే నుంచి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే ద్వారా రూ.50 వేలు వసూలు చేశారు. అనంతరం సరుకును కర్ణాటకకు తరలించకుండా, లారీ అసలు నంబర్ ప్లేట్ స్థానంలో నకిలీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రశాంత్ అనే వ్యక్తికి మొక్కజొన్నలను విక్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 టైర్ల లారీ, నకిలీ లారీ పత్రాలు, మొబైల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ కె. నాగరాజు, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.