కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా..తెలంగాణ విజ్ఞప్తితో అక్టోబర్ 27న నిర్వహించేందుకు నిర్ణయం 

కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా..తెలంగాణ విజ్ఞప్తితో అక్టోబర్ 27న నిర్వహించేందుకు నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా పడింది. 21వ బోర్డు సమావేశం సోమవారం జరగాల్సి ఉండగా.. తెలంగాణ విజ్ఞప్తితో మంగళవారానికి (ఈనెల 27న) వాయిదా వేస్తున్నట్టు బోర్డు శనివారం రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. 26న సీఎం రేవంత్,  మంత్రి ఉత్తమ్ మహారాష్ట్ర సీఎంతో భేటీ కానున్న నేపథ్యంలో.. వారి వెంట వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడిందని, దీంతో బోర్డు మీటింగును వాయిదా వేయాలని ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు లేఖ రాశారు.