అక్షయ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు జంటగా రుక్మిణి మైత్రా

అక్షయ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు జంటగా రుక్మిణి మైత్రా

బాలీవుడ్ స్టార్‌‌‌‌‌‌‌‌ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సముక్‌‌‌‌’. ఈ ఏలియన్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌కు కనిష్క్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.  సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై విపుల్ అమృత్‌‌‌‌లాల్ షా నిర్మిస్తున్నారు. ఇటీవల ఇందులో హీరోయిన్‌‌‌‌ను రివీల్ చేశారు. అక్షయ్‌‌‌‌కు జంటగా రుక్మిణి మైత్రా నటిస్తున్నట్టు తెలియజేశారు. తన మాతృభాష బెంగాలీలో ఎక్కువ సినిమాలు చేసిన ఆమె..  విద్యుత్ జమాల్‌‌‌‌ హీరోగా ఇదే బ్యానర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘సనక్‌‌‌‌’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత అదే హీరో నటించిన ‘క్రాక్‌‌‌‌’లో స్పెషల్‌‌‌‌ అప్పీయరెన్స్‌‌‌‌ ఇచ్చింది. బాలీవుడ్‌‌‌‌లో సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆమెకు.. ‘సముక్‌‌‌‌’ రూపంలో క్రేజీ ఛాన్స్‌‌‌‌ వచ్చింది. అక్షయ్ కుమార్‌‌‌‌‌‌‌‌ లాంటి స్టార్‌‌‌‌‌‌‌‌కు జంటగా నటిస్తుండడంతో పాటు కొత్త తరహా జానర్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఈ సినిమా తన కెరీర్‌‌‌‌‌‌‌‌కు హెల్ప్‌‌‌‌ అవుతుందని భావిస్తోంది.