హైదరాబాద్: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 27వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉంది.
అక్టోబర్ 28వ తేదీన వాయుగుండం బలపడి తీరం దాటే అవకాశం ఉండటంతో.. తెలంగాణలో భారీ, అతి భారీ ,అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్గాలు సంభవించే అవకాశం ఉంది. మంచిర్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ చేసింది.
ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉంది. 29వ తేదీన కూడా అక్కడక్కడ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
