కన్నడిగులను పక్కన బెడితే చర్యలు తప్పవ్.. ఐటీ కంపెనీలకు కర్నాటక సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

కన్నడిగులను పక్కన బెడితే చర్యలు తప్పవ్.. ఐటీ కంపెనీలకు కర్నాటక సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

కర్నాటకలో కొత్త వివాదం  తెరపైకి వచ్చింది. ఉద్యోగ నియామకాల్లో ఐటీ కంపెనీలు కన్నడిగులను పక్కన బెడుతున్నాయని, టాలెంట్, స్కిల్స్ ఉన్నా కేవలం కన్నడిగులైనందుకే ఉద్యోగం ఇవ్వకుండా  వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులోని  ఐటీ కంపెనీలతీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. తమ భవిష్యత్తును కాలరాస్తున్నారని ఆరోపిస్తూ ఈ విషయంలో సీఎం డీకే శివకుమార్ జోక్యం చేసుకోవాలని కన్నడ విద్యావంతులు,ఉద్యోగార్థులు విజ్ణప్తి చేయడం సంచలనంగా మారింది. ఉద్యోగార్థులు సోషల్ మీడియాలో చేసిన విజ్ణప్తుల మేరకు ఐటీ కంపెనీలకు కర్నాటక సీఎం డీకే శివకుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఐటీ కంపెనీల్లో  కన్నడిగులను తీసుకోవడం లేదని వస్తున్న వార్తల క్రమంలో  తీవ్ర హెచ్చరికలు చేశారు. 

కర్నాటకలోని ఐటీ కంపెనీల్లో కన్నడిగులను తప్పనిసరిగా తీసుకోవాలని లేదంటే ఆయా కంపెనీలను ఆంక్షలు తప్పవని అన్నారు.  స్థానికుల హక్కులు, గౌరవం, ఉద్యోగ అవకాశాలను నిర్లక్ష్యం చేయడాన్ని తమ ప్రభుత్వం సహించదని చెప్పారు. 

బెంగళూరు ఐటీ కంపెనీల్లో  కన్నడ మాట్లాడిన వారికి ఉద్యోగం ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. కర్ణాటకలో కన్నడిగులే సార్వభౌములు. ఏ కారణం చేతనైనా కన్నడిగుల హక్కులు, గౌరవం, అవకాశాలను విస్మరించడానికి ప్రభుత్వం అనుమతించదు..అని Xలో సీఎం ఓ పోస్ట్ షేర్ చేశారు. 

బెంగళూరులో కన్నడిగులకు ఉద్యోగాల ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న క్రమంలో సీఎంఈ ప్రకటన చేశారు.ఐటీ రాజధాని బెంగళూరుకు ఉన్న హోదాను ప్రస్తావిస్తూ.. కన్నడిగుల ప్రతిభ, స్కిల్స్, సామర్థ్యం పట్ల గర్విస్తు్న్నామన్నారు.ఏదైన ఐటీ కంపెనీ వారిని పక్కనబెట్టినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. 

ఇటీవల ఓ మహిళ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.అందులో ఇలా రాశారు.  బెంగళూరు కు చెందిన ఐటీ కంపెనీలు తమ రెజ్యూమెలలో మాతృభాష కన్నడ అని రాస్తే ఉద్యోగాలు ఇవ్వకుండా అప్లికేషన్లు తిరస్కరిస్తు్న్నారని అన్నారు.   అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో జరిగే క్యాంపస్ ఇంటర్వ్యూలలో తక్కువ జీతాలకు సెలక్ట్ చేస్తున్నారని ఆ మహిళ ఆరోపించారు. ఫలితంగా  కన్నడిగులకు ఉద్యోగాలు రావడంలేదు.. అని ఆమె వీడియోలో చెబుతూ, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని శివకుమార్‌కు విజ్ఞప్తి చేశారు.