Good News: జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వరకు నాన్ స్టాప్ జర్నీ.. ఇక ట్రాఫిక్ లొల్లే ఉండదు!

Good News: జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వరకు నాన్ స్టాప్ జర్నీ.. ఇక ట్రాఫిక్ లొల్లే ఉండదు!

 హైదరాబాద్ సిటీలో అత్యంత రద్దీ రూటయిన జేఎన్టీయూ-హైటెక్ సిటీ మార్గంలో వెళ్లే వాళ్లకు ఇది గుడ్ న్యూ్స్. ఇకనుంచి గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకునే పరిస్థితి ఉండదు. జేఎన్టీయూ నుంచి 15-20 నిమిషాల్లో సైబర్ టవర్స్ కు చేరుకోవచ్చు. అదెలాగంటారా..? సైబరాబాద్ పోలీసులు, అధికారులు చేస్తున్న ప్లాన్ గురించి తెలస్తే.. హమ్మయ్య ట్రాఫిక్ లొల్లి తప్పిందిరాబాబూ అనుకుంటారు. 

 ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్‌ను తగ్గించి బస్సు ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అధికారులు కలిసి 7 కిలోమీటర్ల కౌంటర్‌ఫ్లో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (బీఆర్‌టీ) పైలట్ ప్రాజెక్టును ప్రతిపాదించాయి.

జేఎన్‌టీయూ – హైటెక్ సిటీ – రాయదుర్గం – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కారిడార్‌లో ఈ ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. సాధారణ ట్రాఫిక్ దిశకు వ్యతిరేకంగా బస్సులు ప్రయాణించే ప్రత్యేక లేన్ ఏర్పాటు చేయడం దీని ప్రధాన లక్ష్యం. దీనివల్ల ట్రాఫిక్ క్యూల్లో బస్సులు చిక్కుకోకుండా ప్రయాణ సమయం తగ్గించవచ్చునని అధికారులు భావిస్తున్నారు.  

ఎలా పనిచేస్తుంది?  

సాధారణ బస్ లేన్‌లా కాకుండా, కౌంటర్‌ఫ్లో లేన్‌లో బస్సులు ఇతర వాహనాలకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. ఈ లేన్ బస్సులకు మాత్రమే కేటాయింస్తారు. కేవలం బస్సులే నడిచేలా ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లేన్ మార్కింగ్‌లు, భద్రతా చర్యలు చేపడతారు. బస్సులు లేన్ లోకి ప్రవేశించి, బయటకు వెళ్లే పాయింట్లు, ముఖ్యంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ జంక్షన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త అడ్డంకులు ఏర్పడకుండా ట్రాఫిక్ కదలికలు, మెర్జింగ్ పరిస్థితులు పరిశీలిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితి  ఏంటి..?

ప్రస్తుతం ఈ కారిడార్‌లో గంటకు సుమారు 15 బస్సులు నడుస్తున్నాయని టీజీఎస్‌ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. అదనపు బస్సులు నడపవచ్చా అని అధ్యయనం చేస్తున్నారు. ఫౌండేషన్ ఫర్ రిసోర్సెస్ అండ్ ఇన్నోవేషన్స్ పాలసీ (ఎఫ్‌ఆర్‌ఐపీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సమన్వయంతో నిర్వహించిన ట్రాఫిక్ అసెస్‌మెంట్‌లో రోడ్డు పక్కన పార్కింగ్, ఎన్‌క్రోచ్‌మెంట్లు, లేన్ డిసిప్లిన్ లేకపోవడం, అనధికారిక స్టాప్‌లు, జంక్షన్ సమస్యలు ప్రధాన కారణాలుగా గుర్తించారు. బస్ బేస్, షెల్టర్లు, ఫుట్‌పాత్‌లు, పాదచారుల సౌకర్యాలు సరిపడా లేవని కూడా తేలింది.

మెక్సికో సిటీ మెట్రోబస్ వంటి అంతర్జాతీయ బీఆర్‌టీ వ్యవస్థల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, సాధారణ కర్బ్-సైడ్ బస్ లేన్లు, బస్ స్టాప్‌లు, పాదచారుల సౌకర్యాల మెరుగుదలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన  ట్రయల్ ప్లానింగ్ దశలోనే ఉంది.