ప్రముఖ మానవతావాది, ఆంత్రప్రెన్యూవర్, ఇన్ఫ్లూయెన్సర్ హుస్సేన్ మన్సూరీ గురించి తెలిసే ఉంటుంది. పేదరికం నుంచి ఎదిగిన ఆయన.. పేదలకు సాయం చేస్తూ ఫేమస్ అయ్యారు. గల్లీల్లో తిరుగుతూ.. స్లమ్ లో గడుపుతూ.. పేదల కష్టాలను తెలుసుకుంటూ.. వారికి తోచిన సాయం చేస్తూ వస్తున్న మన్సూరీ లేటెస్టుగా ఒక బ్లింకిట్ ఏజెంట్ కు స్కూటీ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది.
స్కూటీ కొనే డబ్బులు లేకపోవడంతో సైకిల్ పైనే డెలివరీ చేస్తున్న ఏజెంట్ కు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు మన్సూరీ. గుండెను కరిగించే ఈ వీయియో ఇన్ స్టాలో షేర్ చేశారు. అది ఇప్పుడు ట్రెండింగ్ గా మారుతోంది.
ముంబైలో ఎండకు సైకిల్ తొక్కలేక తొక్కుతూ ఇబ్బంది పడుతూ.. ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న సుజీత్ అనే యువకుడి గురించి తెలుసుకున్న మన్సూరీ.. సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకు స్కూటీ కొనలేదు అని అడగగా.. ఇంత తక్కువ సంపాదనతో స్కూటీ ఎలా కొంటాను సర్ అని సమాధానం ఇచ్చాడు.
అనంత్ అంబానీ గిఫ్ట్:
అతని బాధ విన్న హెస్సేన్ మన్సూరీ .. డెలివరీ పూర్తి చేసుకుని వస్తే ఒక సర్ ప్రైజ్ ఇస్తానని సుజీత్ కు చెప్పారు. తిరిగి వచ్చిన సుజీత్ కళ్లకు గంతలు కట్టి.. ఒక రెడ్ కవర్ ఓపెన్ చేయమన్నారు.
సుజీత్ కవర్ ఓపెన్ చేసి చూడగా స్కూటీ. అనంత్ అంబానీ నుంచి చిన్న గిఫ్ట్ నీకు అని మన్సూరీ సుజీత్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. అది చూసిన సుజీత్ ఆనందంతో మన్సూరీని కౌగిలించుకున్నాడు. థ్యాంక్యూ సర్ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
అనంత్ సేవా ఫౌండేషన్ నుంచి ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు మన్సూరీ తెలిపారు. రహూల్ కనల్, హుస్సేన్ మన్సూరీతో కొలాబరేషన్ లో అనంత్ అంబానీ ఫౌండేషన్.. ముంబైలో కష్టపడి పనిచేసే కార్మికులకు స్కూటీలు ఇస్తుంటుంది.
🚨 Blinkit delivery worker reportedly gifted a scooter to replace his bicycle! https://t.co/lhMfYBE8gC
— India Live (@IndiaLiveIN) October 25, 2026
