బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనిత్ పడ్డా ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా కనిపించనుందని తెలుస్తోంది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్‌తోపాటు పలువురు పేర్లు వినిపించగా, అనిత్ పడ్డాను ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ‘సైయారా’ సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఆమె ఈ చిత్రంలో తనదైన నటనతో యూత్‌ను ఆకట్టుకుంది.
ఇప్పుడు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కితే, తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఆమె ఎంట్రీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ‘ఆర్‌సీ 17’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటుల ఎంపికపై మేకర్స్ వర్క్ చేస్తున్నారు. నవంబర్ 1న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
