కుత్బుల్లాపూర్, వెలుగు : సూరారం పరిధిలోని ఓ ఇంట్లో చిన్న సిలిండర్‌పై వంట చేస్తుండగా గ్యాస్‌లీకై పేలడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్‌కి చెందిన దార్ బహదూర్ (60)కుటుంబంతో కలిసి భగత్‌సింగ్‌నగర్‌లో ఉంటున్నాడు. నెల క్రితం కొడుకు చనిపోవడంతో కుటుంబమంతా నేపాల్ వెళ్లిపోయింది.
మళ్లీ ఆదివారమే బహదూర్ తన మరో కొడుకు కృష్ణతో కలిసి వచ్చాడు. కృష్ణ తనుపనిచేసే కంపెనీ వద్ద ఉంటుండగా బహదూర్ భగత్‌సింగ్‌నగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం చిన్న సిలిండర్‌పై వంట చేస్తుండగా గ్యాస్‌లీకై ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బహదూర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో గాంధీ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలరాజు తెలిపారు.
