బెంగళూరు: ఐటీ సంస్థలు కన్నడిగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కావాలని పక్కనపెడితే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నాటక సీఎం డీకే శివకుమార్ హెచ్చరించారు. రాష్ట్రంలో కన్నడిగుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. బెంగళూరులోని ఐటీ సంస్థలు ఉద్యోగ నియామకాల్లో భాషా వివక్ష చూపిస్తున్నాయంటూ ఓ యువతి చేసిన వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరలైన నేపథ్యంలో డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.
