బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌‌‌‌‌‌‌‌కు భారత్ ఆతిథ్యం.. రష్యా పార్లమెంట్ చైర్మన్‌‌‌‌‌‌‌‌తో ఓం బిర్లా భేటీ 

బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌‌‌‌‌‌‌‌కు భారత్ ఆతిథ్యం.. రష్యా పార్లమెంట్ చైర్మన్‌‌‌‌‌‌‌‌తో ఓం బిర్లా భేటీ 

న్యూఢిల్లీ: బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ 12వ సమావేశాలు సోమవారం ఢిల్లీలో ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ‘ప్రజల అభివృద్ధి కోసం పార్లమెంట్లను బలోపేతం చేయడం’ ఈసారి సమావేశాల ప్రధాన లక్ష్యం. ఫోరమ్‌‌‌‌‌‌‌‌కు ముందు లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా.. రష్యా పార్లమెంట్ దిగువ సభ స్టేట్ డూమా చైర్మన్ వ్యాచెస్లావ్ వోలోడిన్‌‌‌‌‌‌‌‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడాలని, అంతర్జాతీయ వేదికలపై పరస్పరం సహకరించుకోవాలని చర్చించారు.

భారత్‌‌‌‌‌‌‌‌-, రష్యా దౌత్య సంబంధాలకు 2027లో 80 ఏళ్లు పూర్తవుతాయని బిర్లా తెలిపారు. ఇరు దేశాల ఎంపీల మధ్య సమావేశాలు, యువ, మహిళా ఎంపీల పర్యటనలు పెంచాలని సూచించారు. అణుశక్తి, పరిశ్రమల రంగాల్లో సహకారంపైనా చర్చించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌‌‌‌‌‌‌‌కు శాశ్వత సభ్యత్వం విషయంలో రష్యా మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు అడ్డంకులు తొలగించాలని వోలోడిన్ కోరారు.