విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకుడు. రానా దగ్గుబాటి సమర్పణలో స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. నవంబర్ 13న సినిమా విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్ లంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ ‘ప్రతి మనిషిలో ఒక డ్యూయాలిటీ ఉంటుంది. అది ఈ సినిమా చూసినప్పుడు మిర్రర్ రిఫ్లెక్షన్స్‌లా కనిపిస్తుంది. ఇది నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్‌లాంటి సినిమా. ఏ భాషలో వచ్చిన సినిమాతోనూ దీనిని కంపేర్ చేయలేరు. ఇది ఒక తెలుగు సినిమా అని గర్వంగా చెబుతున్నా. కచ్చితంగా ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది’ అని చెప్పాడు.
ఇది రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉండే సినిమా కాదని, చాలా డిఫరెంట్‌గా ఉంటుందని బిందు మాధవి చెప్పింది. ఇదొక బ్లెండ్ ఆఫ్ జానర్స్‌లో ఉంటుందని అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తూ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా సినిమా ఉంటుందని దర్శకుడు శశాంక్ శ్రీవాస్తవ్ అన్నాడు. నటుడు రాకేష్ రాచకొండ, ప్రొడక్షన్ డిజైనర్ నాగవ్ పాల్గొన్నారు.
