ఈ-సినీప్రమాణ్ పోర్టల్లో భద్రతా లోపం.. సినిమాల కీలక వివరాలు లీక్

ఈ-సినీప్రమాణ్ పోర్టల్లో భద్రతా లోపం.. సినిమాల కీలక వివరాలు లీక్

భారతీయ సినీ పరిశ్రమలో భారీ డేటా లీక్ కలకలం రేపుతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు చెందిన ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భద్రంగా ఉండాల్సిన 500కు పైగా సినిమాల రహస్య పత్రాలు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బయటపడ్డాయి.  

ఈ లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమాల షూటింగ్ స్క్రిప్టులు, సెన్సార్ కట్స్ వివరాలు, నిర్మాతలు–డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన ఒప్పందాలు, లైసెన్సింగ్ ఫీజులకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, సినిమాల వీడియోలు లీక్ కాలేదు.  

సెన్సార్ సర్టిఫికేషన్ కోసం నిర్మాతలు పత్రాలను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసే ‘ఈ-సినీప్రమాణ్’  పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భద్రతా లోపాల కారణంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.  విషయం వెలుగులోకి రావడంతో లీకైన ఫైళ్లను తొలగించి, ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.  అలాగే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోర్టల్ భద్రతను సమీక్షించేందుకు సెక్యూరిటీ ఆడిట్ చేపట్టారు.