అనీష్, అనస్వర రాజన్ జంటగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగార్జున సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు టీమ్ తెలియజేసింది. ‘‘ఇట్లు అర్జున’ చిత్రం అనుకున్నట్లుగా అక్టోబర్ 30న విడుదల కావడం లేదని తెలియజేయడానికి చింతిస్తున్నాము.
కొత్త రిలీజ్ డేట్‌ను అతి త్వరలోనే ప్రకటిస్తాం. అప్పటి వరకు, ఈ యంగ్ టీంకి మీ ప్రేమను, మద్దతును ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఒక్కటి మాత్రం నిజం.. థియేటర్లలో అర్జున్ ప్రేమ రెట్టింపు ఉత్సాహంతో, భారీగా వినిపించబోతోంది’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ డేట్‌కు వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ విడుదలవుతున్న నేపథ్యంలోనే తమ సినిమాను వాయిదా వేసుకున్నారు మేకర్స్.
