40 గజాల స్థల వివాదం.. అన్న చేతిలో తమ్ముడి హత్య!

40 గజాల స్థల వివాదం.. అన్న చేతిలో తమ్ముడి హత్య!

 మెదక్/సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంది మండలం మక్తలూరు గ్రామంలో  దారుణ హత్య జరిగింది. ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదం అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీయగా, అన్న దాడిలో తమ్ముడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొత్తగాడి వెంకటేశ్(48), అతడి తమ్ముడు కొత్తగాడి శ్రీనివాస్‌‌‌‌(36) మధ్య సుమారు 40 చదరపు గజాల ఇంటి స్థలం విషయంలో రెండేండ్లుగా వివాదం కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే శనివారం రాత్రి వెంకటేశ్​తన తమ్ముడు శ్రీనివాస్‌‌‌‌పై కర్రతో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థల వివాదమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.