సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. ఐటీపీఓలో అసిస్టెంట్ పోస్టులు

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. ఐటీపీఓలో అసిస్టెంట్  పోస్టులు

భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 46.

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ అసిస్టెంట్ (సివిల్) 7, సీనియర్ అసిస్టెంట్ 4, సీనియర్  అసిస్టెంట్ (ఆర్కిటెక్చర్) 1, అసిస్టెంట్ (అకౌంట్స్) 10, జూనియర్ స్టెనోగ్రాఫర్ 5, జూనియర్ అసిస్టెంట్ (జనరల్ కేడర్) 19. 

విద్యార్హతలు

సీనియర్ అసిస్టెంట్:  సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి. 
అసిస్టెంట్: కనీసం సెకండ్ క్లాసుతో బి.కాం పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్​పై పరిజ్ఞానం ఉండాలి. రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. 
జూనియర్ స్టెనోగ్రాఫర్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ 
పూర్తిచేసి ఉండాలి. షార్ట్ హ్యాండ్/ టైపింగ్ స్పీడ్ 80/ 40 డబ్ల్యూపీఎం ఉండాలి. 
జూనియర్ అసిస్టెంట్: సెకండ్ క్లాసుతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్​పై ఇంగ్లిషులో 35 డబ్ల్యూపీఎం టైపింగ్ స్పీడ్ లేదా హిందీలో 30 డబ్ల్యూపీఎం స్పీడ్ ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ – పాయింట్​లో పరిజ్ఞానం ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. 
అప్లికేషన్: ఆన్‌లైన్  ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 17.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ. 1000 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 13.
సెలెక్షన్ ప్రాసెస్: ఎస్ఎస్​సీ పరీక్షల ర్యాంకులు లేదా గేట్ స్కోర్‌, అభ్యర్థుల అనుభవాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ /www.itpo.gov.inను సందర్శించండి.