సివిల్ ఇంజినీర్లకు PJTAUలో ఉద్యోగాలు.. అనుభవం ఉంటే చాలు.. అక్టోబర్ 30 లాస్ట్ డేట్..

 సివిల్ ఇంజినీర్లకు PJTAUలో ఉద్యోగాలు.. అనుభవం ఉంటే  చాలు..  అక్టోబర్ 30 లాస్ట్ డేట్..

హైదరాబాద్ రాజేంద్రనగర్‌‌‌‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఇంజినీరింగ్ డివిజన్ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న భారీ కళాశాల భవన నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు అర్హత, అనుభవం గల సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్.

మొత్తం ఖాళీలు: 4. కొడంగల్, హుజూర్​నగర్, డిచ్​పల్లి క్యాంపస్​లు, వరంగల్ సబ్– డివిజన్లలో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయి. 

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ  నుంచి సివిల్ ఇంజినీరింగ్‌‌‌‌లో ఫస్ట్ క్లాస్‌‌‌‌లో బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో ముఖ్యంగా బిల్డింగ్ కన్​స్ట్రక్షన్, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ లేదా పబ్లిక్ వర్క్స్ విభాగాల్లో ప్రముఖ కంపెనీలు లేదా సంస్థల్లో కనీసం ఏడాది  ఆన్‌‌‌‌సైట్ అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 23.

లాస్ట్ డేట్: అక్టోబర్ 30.

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, సంబంధిత పని అనుభవం ఆధారంగా షార్ట్​లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ pjtau.edu.inను సందర్శించండి.