ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 109 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 109.
విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్–II 19, అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్–III 47, అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్–IV 36, అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్–II 7.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ఆర్ట్స్ / కామర్స్ / సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి, మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. ఏదైనా బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా అర్హత ఉండాలి. ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసి, అదనంగా మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పొంది ఉండాలి.
వయసు: 2026, సెప్టెంబర్ 30 నాటికి 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 19.
లాస్ట్ డేట్: నవంబర్ 2.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.engineersindia.comను సందర్శించండి.
