సిద్దిపేట జిల్లాలో ఉద్యోగావకాశాలు.. 8వ తరగతి పాసైతే చాలు.. నిరుద్యోగులకు అక్టోబర్ 31 వరకు ఛాన్స్..

సిద్దిపేట  జిల్లాలో ఉద్యోగావకాశాలు.. 8వ తరగతి పాసైతే చాలు..  నిరుద్యోగులకు అక్టోబర్ 31 వరకు ఛాన్స్..

సిద్దిపేట జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 8.

విభాగాల వారీగా ఖాళీలు: మల్టీ పర్పస్ వర్కర్ 2, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 3, సైకో సోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1, ఫార్మాసిస్ట్ 1.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద, యునాని, హోమియోపతి లేదా నేచురోపతి విభాగంలో డిగ్రీ, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఫార్మా.-డి,  మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్​లో పోస్ట్ గ్రాడ్యుయేట్,  నేచురోపతిలో డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, ఎనిమిదో తరగతితోపాటు సైకిల్/ మోటార్ సైకిల్ నడప కలిగే సామర్థ్యం ఉండాలి.

వయసు: 18 నుంచి 44  ఏళ్ల మధ్యలో ఉండాలి.  బీసీ, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్ లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 21.

లాస్ట్ డేట్:  అక్టోబర్ 31.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  siddipet.telangana.gov.inను సందర్శించండి. 

►ALSO READ | స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు.. మొత్తం 33 ఖాళీలు.. 44 ఏళ్లలోపు వారికీ ఛాన్స్...