స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు.. మొత్తం 33 ఖాళీలు.. 44 ఏళ్లలోపు వారికీ ఛాన్స్...

స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు.. మొత్తం 33 ఖాళీలు.. 44 ఏళ్లలోపు వారికీ ఛాన్స్...

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్ఓ) కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కాగా అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.

మొత్తం ఖాళీలు: 33.

విభాగాల వారీగా ఖాళీలు: స్టాఫ్​నర్స్ 10, ఏఎన్‌ఎం 5, ల్యాబ్ టెక్నీషియన్ 4, ఫార్మాసిస్ట్ 1, ఎంఎల్​హెచ్​పీ/ సీహెచ్ఓ/ ఎంఓ– పల్లె దవాఖాన 9, ఫిజియోథెరపిస్ట్ 1, ఆడియాలజిస్ట్/ స్పీచ్ థెరపిస్ట్ 1, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ 1, ఆప్టోమెట్రిస్ట్ 1. 

విద్యార్హతలు
ఎంబీబీఎస్ లేదా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపిస్ట్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఫార్మసీలో డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం, ఇంటర్మీడియట్​తో పాటు డీఎంఎల్​టీ లేదా బీఎస్సీ (ఎల్​టీ), డిజబిలిటీ స్టడీస్ (ఎర్లీ ఇంటర్వెన్షన్)లో ఎంఎస్సీతో పాటు ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, ఎంబీబీఎస్, బీఏఎంఎస్/ హోమియోపతిలో ఏదో ఒక బేసిక్ డిగ్రీని కలిగి ఉండాలి.

*ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీలో  నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
*ఆప్టోమెట్రిలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
* పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్ గుర్తింపు పొందిన 18 నెలల ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి లేదా రెండేళ్ల ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎంపీహెచ్ డబ్ల్యూ (మహిళా) కోర్సు పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి.  బీసీ, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్​లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 23.

లాస్ట్ డేట్: అక్టోబర్ 30.

సెలెక్షన్ ప్రాసెస్

మొత్తం 100 మార్కులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

అర్హత పరీక్ష మార్కులకు వెయిటేజీ (90 మార్కులు): పోస్టుకు నిర్దేశించిన విద్యార్హత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం ఆధారంగా 90 మార్కులకు వెయిటేజీ ఇస్తారు.

వయసు ఆధారంగా వెయిటేజీ (10 మార్కులు): అభ్యర్థుల వయసును బట్టి గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు.

వయసు లెక్కింపు విధానం: 2026, జులై 1 నాటికి అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండినప్పటి నుంచి వయసును లెక్కిస్తారు. పూర్తయిన ప్రతి సంవత్సరానికి 0.5  మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు కలుపుతారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ rajannasircilla.telangana.gov.in ను సందర్శించండి.

►ALSO READ | హైదరాబాద్ లో జాబ్స్ : వైద్యశాఖలో పోస్టులు భర్తీ..పది పాసైతే చాలు..మేడ్చల్ -మల్కాజ్‌గిరి DMHO నోటిపికేషన్ రిలీజ్