భారత్‌లో పలు హత్యలు, దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్న గ్యాంగ్‌స్టర్లు హిమాంశు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అమెరికాలో అరెస్ట్ చేసినట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు. అమెరికాలోని లాస్ వెగాస్‌లో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నెలన్నర పాటు స్పెషల్ ఆపరేషన్
హర్యానా పోలీసుల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (STF) ఇచ్చిన సమాచారంతో అమెరికాకు చెందిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE), ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. దాదాపు నెలన్నర పాటు నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించి, చివరకు లాస్ వెగాస్‌లో వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. నీరజ్ ఫరీద్‌పురియాపై 63కు పైగా క్రిమినల్ కేసులు ఉండగా, హిమాంశు భావుపై 41కు పైగా కేసులు ఉన్నాయి. హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో వీరిపై కేసులు నమోదయ్యాయి.
నకిలీ డాకుమెంట్స్ తో అమెరికాకు పరార్
హర్యానా పోలీసుల వివరాల ప్రకారం.. నీరజ్ ఫరీద్‌పురియా 2019లో, హిమాంశు భావు 2022లో భారత్‌ను విడిచి అమెరికాకు వెళ్లారు. నకిలీ పేపర్స్ తో పాస్‌పోర్టులు పొంది, వారి గుర్తింపులను మార్చుకున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరిపై గతంలో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు.
భారత్‌లో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేసేందుకు ముఠాలను నడిపిస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి హర్యానా పోలీసులు ఒక్కొక్కరిపై రూ.10 లక్షల చొప్పున రివార్డు కూడా ప్రకటించారు. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై జరిగిన కాల్పుల ఘటనలోనూ ఈ ముఠా పేరు తెరపైకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానిత షూటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో జైలులో ఉన్న నీరజ్ ఫరీద్‌పురియా, హిమాంశు భావు ఆదేశాల మేరకు ఈ పనిచేసినట్లు వారు వెల్లడించారని పోలీసులు తెలిపారు.
బర్గర్ కింగ్ కాల్పుల కేసులోనూ ముఠా పేరు
2024లో ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో ఉన్న బర్గర్ కింగ్ రెస్టారెంట్‌లో జరిగిన కాల్పుల ఘటనలోనూ హిమాంశు భావు ముఠా పేరు వినిపించింది. ఈ ఘటనలో 26 ఏళ్ల యువకుడు మరణించాడు.
అలాగే, హర్యానాకు చెందిన పాప్ గాయకుడు రాహుల్ యాదవ్ (ఫజిల్‌పురియా) సన్నిహితుడి హత్య కేసులోనూ ఈ ముఠాకు సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. విదేశాల్లో ఉంటూ నేరాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్న కొందరిపైనా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
చిగివారికి భారత్‌లో పలు తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న హిమాంశు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలు అమెరికాలో అరెస్టు చేసారు.
