10 ఓవర్లలో 3 మెయిడిన్లు, 4 వికెట్లు: తెలుగమ్మాయి అద్భుత బౌలింగ్!

10 ఓవర్లలో 3 మెయిడిన్లు, 4 వికెట్లు: తెలుగమ్మాయి అద్భుత బౌలింగ్!

Shree Charani: వడోదరలోని బీసీఏ (కోటంబి) స్టేడియం వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత యంగ్ బౌలర్ శ్రీ చరణి (Sree Charani) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మెరిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న జింబాబ్వే 49.5 ఓవర్లలోనే 197 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక తెలుగమ్మాయి తన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో జింబాబ్వే జట్టుని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. తన 8 ఓవర్ల కోటాలో ప్రత్యర్థి బ్యాటర్లకు ఎలాంటి పరుగులు ఇచ్చే ఛాన్స్ ఇవ్వకుండా, వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేసింది.

3 మెయిడిన్లు, 18 రన్స్, 4 వికెట్లు డౌన్:

* ఈ మ్యాచ్‌లో శ్రీ చరణి నమోదు చేసిన బౌలింగ్ గణాంకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

* శ్రీ చరణి స్పెల్: 10–3–23–4

* శ్రీచరణి వేసిన 10 ఓవర్లలో ఏకంగా 3 ఓవర్లను మెయిడిన్లు చేయడం విశేషం. కేవలం 23 రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైన 4 వికెట్లను పడగొట్టింది.

* శ్రీ చరణి బౌలింగ్ కంట్రోల్, లైన్ అండ్ లెంగ్త్ కారణంగా జింబాబ్వే బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడలేక చేతులెత్తేశారు.

జింబాబ్వే ఇన్నింగ్స్: 

శ్రీ చరణితో పాటు ఇతర భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. బెలోవెడ్ బిజా (43) జింబాబ్వే ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక మోడెస్టర్ ముపాచిక్వా (25), మిచెల్ మవుంగా (29), చిపో ముగేరి-తిరిపానో (21) జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. కాగా యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని నిజం చేస్తూ శ్రీ చరణి అందించిన ఈ డ్రీమ్ స్పెల్ మ్యాచ్‌లోనే హైలైట్‌గా నిలిచింది.