దసరా దాటిన కాడి నుంచి బంగారం, వెండి రేట్లలో పతనం ఊహించని స్థాయిలో కొనసాగుతోంది. దీంతో ఈ వారం ప్రారంభం నుంచి బంగారం షాపుల్లో కస్టమర్ల తాకిడి పెరుగుతోంది. దీపావళికి చాలా మంది బంగారం, వెండి కొంటుంటారు. అలాంటి ప్లాన్స్ ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రస్తుతం తగ్గుతున్న రేట్లను క్యాష్ చేసుకోవటం మంచిది. ఆభరణాలు షాపింగ్ చేద్దామనుకుంటున్నట్లయితే ముందుగా మీ నగరంలో తగ్గిన రిటైల్ రేట్లను తెలుసుకోండి.
అక్టోబర్ 23న బంగారం రేట్లు తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.190 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 248గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 060గా కొనసాగుతోంది.
ALSO READ : హార్మూజ్లో దాడుల టెన్షన్... 7 ఆయిల్ ట్యాంకర్లపై మిసైళ్ల వర్షం
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 23, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో 3 రోజుల్లో కేజీకి రూ.20వేలు తగ్గి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 20వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.220 దగ్గర ఉంది.
