Harry Brook: పాకిస్థాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న త్రైపాక్షిక వన్డే సిరీస్ (Pakistan Tri-Nation Series) మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ వైట్-బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) విశ్వరూపం ప్రదర్శించాడు. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 116 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 202 పరుగులు సాధించి వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. బ్రూక్ సంచలన ఇన్నింగ్స్ దెబ్బకు ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల స్కోర్ సాధించింది.
వన్డే చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ:
హ్యారీ బ్రూక్ కేవలం 114 బంతుల్లోనే తన డబుల్ సెంచరీ మార్కును అందుకోవడంతో వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ద్విశతకం బాదిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతం లో శుభ్‌మన్ గిల్ (117 బంతులు) పేరిట ఉన్న ఈ రికార్డును బ్రూక్ ఒక్కసారిగా బ్రేక్ చేసేశాడు.
ఆటగాడు బంతులు జట్టు ప్రత్యర్థి వేదిక సంవత్సరం
హ్యారీ బ్రూక్ 114 ఇంగ్లాండ్ శ్రీలంక రావల్పిండి 2026
శుభ్‌మన్ గిల్ 117 భారత్ వెస్టిండీస్ గౌహతి 2026
ఇషాన్ కిషన్ 126 భారత్ బంగ్లాదేశ్ చట్టగ్రామ్ 2022
గ్లెన్ మాక్స్‌వెల్ 128 ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ముంబై 2023
ఇంగ్లాండ్ తరఫున తొలి డబుల్ సెంచరీ:
వన్డే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ తరఫున డబుల్ సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్ చరిత్రకెక్కాడు. గతంలో న్యూజిలాండ్‌పై బెన్ స్టోక్స్ చేసిన 182 పరుగుల రికార్డును బ్రూక్ తుడిచిపెట్టాడు.
క్రిస్ గేల్ తర్వాత ట్రిపుల్ ట్రెబుల్ రికార్డు:
* టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ (300), వన్డేల్లో డబుల్ సెంచరీ (200), టీ20ల్లో సెంచరీ (100) సాధించిన ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు.
* ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక తొలి ప్లేయర్ వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్.. ఓపెనర్ కాకుండా నాన్-ఓపెనర్ (మిడిల్ ఆర్డర్) విభాగంలో ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాటర్ గా బ్రూక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
నాన్-ఓపెనర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోర్:
* వన్డేల్లో 4వ స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా బ్రూక్ నిలిచాడు. ఓవరాల్‌గా నాన్-ఓపెనర్ కేటగిరీలో గ్లెన్ మాక్స్‌వెల్ (201*) రికార్డును అధిగమించి 202 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ALSO READ : క్రైస్ట్‌చర్చ్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. కివీస్‌పై హైయెస్ట్ ఛేజ్!
కెప్టెన్‌గా విదేశీ గడ్డపై రికార్డు:
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన 4వ కెప్టెన్‌గా (రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, వీరేందర్ సెహ్వాగ్ తర్వాత) నిలిచిన బ్రూక్.. విదేశాల్లో (Away/Neutral Venue) కెప్టెన్‌గా డబుల్ సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో సనత్ జయసూర్య (189 - షార్జా) పేరిట ఉన్న రికార్డును హ్యారీ అధిగమించాడు.
