ఆటోమొబైల్ డీలర్ మహావీర్ మోటార్స్ హైదరాబాద్ కొండాపూర్ షోరూమ్‌లో మెర్సిడెస్ బెంజ్ దసరా డ్రీమ్ డేస్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఒకేరోజు 50 కొత్త మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్లను కొనుగోలుదారులకు డెలివరీ చేశారు.
మహావీర్ గ్రూప్ ఛైర్మన్ యశ్వంత్ ఝబాక్, మహావీర్ మోటార్స్ ఎండీ వరుణ్ ఝబాక్, సీఈఓ నితిన్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొని కస్టమర్లకు స్వయంగా కార్ల తాళాలను అందించారు
