సక్సెస్ అంటే పరిగెత్తడం, అందరికంటే ముందే కొత్త ట్రెండ్‌ను అందుకోవడం, ప్రతి గెలుపును సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ రంగంలోకి దిగాక ఎంతటి ఉత్కంఠ వాతావరణంలోనైనా ఎంత కూల్‌గా ఉంటాడో.. బిజినెస్ ప్రపంచంలోనూ మహేంద్ర సింగ్ ధోనీ అదే కూల్‌తో అడుగులు వేశాడు. ఎలాంటి హడావుడి లేకుండా, ఎవరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఏకంగా రూ.వెయ్యి కోట్లకు పైగా విలువైన బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఈ జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన 7 ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ లెసన్స్ ఇవే..
1. మనసు ఉన్న చోటే పెట్టుబడి పెట్టాలి:
ధోనీకి చెన్నైతో ఉన్న అనుబంధం కేవలం క్రికెట్ వరకే పరిమితం కాలేదు. పెద్ద పెద్ద నగరాలు, గ్లామర్ కార్పొరేట్ కంపెనీల వైపు చూడకుండా 'చెన్నైయిన్ ఎఫ్‌సీ'లో ఓనర్షిప్ తీసుకున్నాడు. స్పాన్సర్లు, అధికారులతో కాకుండా యంగ్ ప్లేయర్లతో కలిసి లంచ్ చేయడం, వాళ్ల కష్టాలను తెలుసుకోవడం ఆయన నైజం. మనం ఇష్టపడే, మనసుకి నచ్చిన చోటే ఏ పనినైనా మొదలుపెట్టాలి. ట్రస్ట్ ముందు వస్తుంది.. మనీ ఆటోమేటిక్‌గా వెనుక వస్తుంది.
2. సాధారణమైన ఐడియాలను తక్కువగా చూడొద్దు:
ధోనీ చేసిన అత్యంత ఆశ్చర్యకరమైన పెట్టుబడుల్లో 'హౌస్ ఆఫ్ బిర్యానీ' ఒకటి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు కస్టమైజ్ చేసుకునే "మేరీ వాలీ బిర్యానీ" కాన్సెప్ట్ నచ్చి రూ.32 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. జనాలకు ఆ సాధారణమైన ఆలోచన బాగా నచ్చడంతో రెవెన్యూ విపరీతంగా పెరిగింది. పెద్ద పెద్ద ట్రెండ్స్ మాత్రమే కాదు.. సామాన్య ప్రజల రోజువారీ సమస్యలను తీర్చే ఆలోచనలే భవిష్యత్తులో పెద్ద విజయాలను ఇస్తాయి.
3. నమ్మకం క్వైట్ రూమ్స్‌లో పుడుతుంది:
డ్రోన్ల తయారీ సంస్థ 'గరుడ ఏరోస్పేస్'లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు.. ధోనీ ఎలాంటి పెద్ద అనౌన్స్మెంట్స్ చేయలేదు. నేరుగా ప్లాంట్‌కి వెళ్లి విడిభాగాలు ఎలా తయారవుతున్నాయో నిశ్శబ్దంగా గమనించాడు. ఆ తర్వాతే రూ.5 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాడు. మార్కెటింగ్ కోసం ఖర్చు చేసే కోట్లాది రూపాయల కంటే.. మనం చేసే పనిపై నమ్మకం, క్షేత్రస్థాయి పరిశీలనే ఎక్కువ విలువ తెచ్చిపెడుతుంది.
ALSO READ ; అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్ పగటికలలు..
4. ఫ్యాన్సీ పోర్ట్‌ఫోలియో కంటే ప్రాక్టికల్ పోర్ట్‌ఫోలియో ముఖ్యం:
ధోనీ ఎప్పుడూ ఫ్యాన్సీ స్టార్టప్‌ల వెనుక పరుగులు పెట్టలేదు. కార్స్24, ఖతాబుక్, ఈమోటోరాడ్, టాగ్డా రహో.. తన సొంత లైఫ్‌స్టైల్ బ్రాండ్ 'సెవెన్', రాంచీలోని హోటల్, వ్యవసాయ భూములు.. ఇలా ఎక్కడా హడావుడి లేకుండా ప్రశాంతంగా పెరిగే రంగాలనే ఎంచుకున్నాడు. ఇన్వెస్ట్మెంట్ అనేది ట్రోఫీ కేబినెట్ లాంటిది కాదు.. భవిష్యత్తులో పండ్లు ఇచ్చే అందమైన తోట లాంటిదని ధోనీ నమ్మకం.
5. నష్టాలు ఆటలో భాగమే.. మౌనమే సమాధానం:
ఎంతటి మేధావులకైనా నష్టాలు తప్పవు. ధోనీ ఫ్యామిలీ ఆఫీస్ మద్దతు ఇచ్చిన 'బ్లూస్మార్ట్' ఈవీ ట్యాక్సీ సర్వీస్ అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంది. వాల్యూయేషన్ పడిపోయింది. ధోనీ కూడా ఈ దెబ్బను ఫేస్ చేశాడు. అయితే విఫలమైనప్పుడు దాన్ని దాచిపెట్టకుండా నిశ్శబ్దంగా అంగీకరించడమే నిజమైన ఇన్వెస్టర్ లక్షణం. గెలుపును ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో.. ఓటమిని కూడా అంతే ప్రశాంతంగా స్వీకరించాలన్నది మిస్టర్ కూల్ ఫార్ములా.
6. ఎక్కువ మాట్లాడేవాడు కాదు.. ఎక్కువగా వినేవాడే లీడర్:
ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ధోనీ చాలా సమయం తీసుకుంటాడు. ట్రెండ్‌లో ఉంది కదా అని గుడ్డిగా ఎందులోనూ ఇన్వెస్ట్ చేయడు. చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆయన సతీమణి సాక్షి కూడా నంబర్లను విశ్లేషిస్తూ సరైన మార్గంలో పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి హడావుడిగా తీసుకునే నిర్ణయాలే నష్టాలను తెస్తాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలే దీర్ఘకాలిక విజయాన్ని ఇస్తాయని కెప్టెన్ కూల్ పాలసీ.
7. ఒత్తిడిని తట్టుకునే అస్త్రం ఓపిక:
సెలబ్రిటీలందరూ బిజినెస్ చేస్తుంటారు. కానీ అందరూ దాని వెనుక ఉన్న లాజిక్‌ను అర్థం చేసుకోలేరు. ధోనీ విజయ రహస్యం ఆయన వద్ద ఉన్న అమితమైన ఓపిక. ఏ రంగంలోనైనా సరే గుడ్డిగా అదృష్టాన్ని నమ్ముకోకుండా.. ఓపికతో విషయాలను అర్థం చేసుకుని, సరైన సమయంలో అడుగులు వేయడమే అసలైన సక్సెస్ ఫార్ములా.
మనం కోట్లకు పడగలెత్తకపోయినా, మన దైనందిన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏ అవకాశాన్నైనా ఎంచుకునే ముందు సమయం కేటాయించడం, క్షేత్రస్థాయి వాస్తవాలను వినడం, తప్పులను అంగీకరించి ముందుకు సాగడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఏ రంగంలోనైనా తిరుగు ఉండదన్నది ధోనీ పెట్టుబడుల నుంచి ప్రతి ఒక్కరూ స్వీకరించాలి.
